ఈ సీజన్ లో పనస పండ్లు బాగా దొరుకుతాయి. పచ్చి కాయలతో స్పైసీ కూరలు ,చిప్స్ ,జామ్స్ ఇడ్లీలు తియ్యని హల్వా ఎన్నో రకాల పదార్ధాలు వండుకోవచ్చు. కాయలు పండాక కాయలోంచి వచ్చే తొనలు ,ఎంతో మధురమైన రుచితో ఉంటాయి. పనసకాయ బిర్యాని కూడా నోరూరిస్తూ ఎంతో బావుంటుంది. విటమిన్ ఎ,బి,సి,కాంప్లెక్స్ లు అత్యధికంగా ఉండటమేకాక అత్యుత్తమ యాంటీ ఆక్సీడెంట్స్ కు ఇవి మంచి ఆధారం పచ్చి తోనలతో కూరలు చేసుకోవచ్చు.గింజలు లేతగా ఉంటే కూర చాలా బావుంటుంది. పండిన తోనలను గాలి చొరబడని బాక్స్ లో ఉంచి ప్రిజ్ లో ఉంచాలి. ఓపెన్ గా ఉంటే మొత్తం వాసన పరుచుకొంటుంది.

Leave a comment