ఆశ్వాస భవన్ ఏర్పాటు చేశారు సిస్టర్ ఫాబియోలా ఫాబ్రి ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో పుట్టిన సిస్టర్ ఫాబ్రి సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేరళ వచ్చింది కొచ్చి చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో అనాధ పిల్లల కోసం 2005 లో స్థాపించిన ఆశ్వాస భవన్ లో ఇప్పుడు 70 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాన్ని మూడు విభాగాలుగా పిలుస్తారు హోమ్ లో శిశువులు, గర్ల్స్, హోమ్ లో ఆరు నుంచి 18 సంవత్సరాల బాలికలు, బాయ్స్ హోమ్ లో ఆరు నుంచి 18 ఏళ్ళ బాలురు ఉంటారు. 52 సంవత్సరాల ఫాబ్రి 2013 లో భారత పౌరసత్వం పొందారు.