Categories
విటమిన్లు లవణాలు ఎక్కువగా ఉండే యాపిల్ ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుతుంది చర్మాన్ని యవ్వనంగా తాజాగా మార్చేస్తుంది. యాపిల్ లో కొల్లేజన్ ఎక్కువ ముఖం పైన యాపిల్ గుజ్జును రాసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది జిడ్డు తొలగిపోతుంది. సగం యాపిల్ టేబుల్ స్పూన్ ఓట్ మీల్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమం మృతకణాలను తొలగించి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. రెండు టీ స్పూన్ల యాపిల్ గుజ్జు ఒక టీ స్పూన్ చొప్పున దానిమ్మ రసం యోగర్ట్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే ముఖం పైన ముడతలు పోతాయి.