చలిగాలులకు ముఖం పొడిబారి పోతుంది.తేమ కోల్పోతుంది ఇంట్లో ఉండే పదార్థాలతో ముఖ చర్మం మెరిసేలా చేయొచ్చు రెండు స్పూన్ల సెనగపిండి లో స్పూన్ పెరుగు అర చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి మాస్క్ వేసుకొని ఆరిపోయాక కడిగేస్తే చాలు ముఖం మెత్తగా మెరుస్తూ కనిపిస్తుంది. అరటిపండు గుజ్జులో తేనే కలిపి ఈ మిశ్రమంతో మాస్క్ గా వేసుకోవచ్చు. బాదం గింజలు నానబెట్టి గ్రైండ్ చేసి  అందులో స్పూన్ పాలు పోసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిపోయాక కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అంది మెరుస్తూ కనపడుతుంది.

Leave a comment