2003 లో జాస్మిన్ పథేజ బ్లాంక్ నాయిస్ ఉద్యమం ప్రారంభించింది . ఒక నిశ్శబ్ద ప్రదర్శనకు,యువత యువకులు కళాత్మకంగా ప్రదర్శన ఇస్తారు. లింగ వివక్ష వేధింపులకు నిరసనగా చేసే ఈ ప్రదర్శనల్లో ఉద్యమకారులు నేరస్తులను సమాజాన్ని సూటిగా ప్రశ్నించే నినాదాలు, అవి రాసిన దుస్తులు ధరించి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మెరుపు ప్రదర్శన జరుపుతారు కొద్ది నిముషాలే అయినా ఈ ప్రదర్శన జరిపే విధానం ప్రేక్షకులపైన బాగా ప్రభావం చూపెడుతోంది ప్రదర్శన వరకే పరిమితం కాకుండా ఈ సంస్థ వాలంటీర్లు బాధితుల తరుఫున నిలబడి వారిలో ధైర్యాన్ని నిలుపుతారు స్వీయ సహాయం అందిస్తారు కొత్త కొత్త పద్దతులతో జాస్మీన్ నడిపే ఈ నిరసన కార్యక్రమాలకు దేశ విదేశాల్లో పేరుంది ఆమెకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.