ముంబయ్ లో పుట్టి పెరిగింది చేతన్ సిన్హా పతారీ జిల్లాలోని పల్లెటూరి లో పెళ్ళి చేసుకొని వచ్చింది. అక్కడి నిరుపేద మహిళలతో ఆమెకు అనుబంధం. వాళ్ళు కొద్ది డబ్బు దాచుకోవాలనా వారికి  ఖాతాలు తెరి చేందుకు బ్యాంక్ అంగీకరించ లేదు. వాళ్ళ కోసం ఓ సహకార బ్యాంక్ పెట్టించాలని రిజర్వ్ బ్యాంక్ కు దరఖాస్తు చేసింది చేతన. మహిళలకు అక్షరాస్యత లేదు గనుక బ్యాంక్ శాంక్షన్ కాలేదు. ఆ గ్రామ మహిళలు పట్టుదలగా ఐదు నెలల పాటు చేతన దగ్గర అక్షరాలు నేర్చుకొన్నారు. అప్పుడు మళ్ళీ బ్యాంక్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు అలా చేతనా సిన్హా ఆధ్వర్యంలో,మహిళల కోసం వారే పెట్టుకొన్న తొలి గ్రామీణ బ్యాంక్ మన్ దేశి మహిళా సహకార బ్యాంక్ శాంక్షన్ అయింది. కార్పొరేట్ బ్యాంక్ లకు ధీటుగా ఎ టి ఎం లతో సహా అన్ని రకాల సేవలు అందించే ఈ బ్యాంక్ సభ్యులు లక్ష మంది ఖాతా దారులున్నారు. ఈ సహకార బ్యాంక్ సభ్యులు ఓ బిజినెస్ స్కూల్ కమ్యూనిటీ రేడియో,ఓ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని ఏర్పాటు చేసుకొన్నారు.

Leave a comment