Categories
మోడర్న్ లుక్ కోసం ఎక్కువ మంది అమ్మాయిలు జంప్ సూట్స్ ఎంచుకొంటున్నారు విమానం లోంచి కిందికి దుకే పారా షూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఈ జంప్ సూట్ ను 1930లో ఫ్యాషన్ డిజైనర్, ఎల్సా షియాపెరెల్లి ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేసింది.ఒళ్లంతా కప్పి ఉంచడంతో పాటు, కదలికలకు ఇబ్బంది కలిగించని జంప్ సూట్స్ ఎన్నో రకాల మెటీరియల్స్ తో రూపొందుతున్నాయి. పార్టీ వేర్, రెగ్యులర్ వేర్ ఫ్యామిలీ వెకేషన్ లు ఇవి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.టీ షర్ట్, షర్ట్, క్రాప్ టాప్ తో కలిసి ధరించవచ్చు.జంప్ సూట్‌తో షూ, వెడ్జెస్, హీల్స్ ఏవైనా బావుంటాయి ఫంకీ లుక్ కోసం స్కార్ఫ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ ఎంచుకోవాలి.ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదరణ పొందుతున్నాయి.