ఇంటి అందాన్ని పెంచడం లోను స్వచ్ఛమైన గాలిని అందించే విషయంలో టెర్రేరియిమ్ మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి అంటారు జిన్సీ వర్గీస్. గాజు సీసాలో మట్టి వేసి రెండు మూడు రకాల మొక్కలు పెంచటమే టెర్రేరియిమ్ అంటారు. వీటి నిర్వహణ చాలా సులభం వెలుతురు పడేట్లు ఒక మూల పెడితే చాలు. గాజు మూత పెట్టడం వల్ల ఆవిరైన నీరు కిందికే మొక్కల పైన పడుతుంది. అంచేత  అవి ఎప్పుడూ తేమ తో నిండి ఉంటాయి. ఈ టెర్రేరియిమ్ బిజినెస్ కూడా లాభదాయకం అంటున్నారు జిన్సీ వర్గీస్ .మైక్రో ఫారెస్ట్ పేరుతో ఆమె అందంగా ఆకర్షణీయంగా ఉండే గాజు సీసాలో ఉష్ణమండల మొక్కలైన ఫెర్న్ మాస్ లను పెంచి విక్రయిస్తారు.

Leave a comment