Categories
గర్భిణిగా ఉన్నపుడు ఎప్పుడు విషాద వార్తలు వింటూ వున్న లేదా ఏదైనా విషయంలో బాగా ఆందోళన చెందుతూ ఉన్న ఆ ప్రభావం గర్భస్థు శిశువు మెదడులో భావోద్వేగాలు,మాట్లాడటానికి సంబందించిన భాగంలో చురుకుదనం తగ్గి పోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇందుకోసం కొంత మంది గర్భిణీలను ఎంపిక చేసి వాళ్ళకు ఎన్నో భావోద్వేగపరమైన విషయాలు వినిపిస్తూ,గర్భస్థ శిశువు మెదడులోని రక్త ప్రసారంలో జరిగే మార్పులను స్కానింగ్ లో ప్రతి ఫలిస్తున్న కాంతి ద్వారా తెలుసుకున్నారు. పాత రోజుల్లో కూడా గర్భవతులుగా ఉన్న సమయంలో ఏదైనా దుర్వార్తను ఆమెకు వినిపించేందుకు పెద్దవాళ్ళు వప్పుకునేవాళ్ళు కాదు. బహుశా ఇదే కారణం అయివుండచ్చు.