Categories
ఇది సీతాఫలాల సీజన్ ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలున్న పలం ఇది. పండులోని ప్రతి భాగం ఔషధమే . విత్తనాలు వేళ్ళ నుంచి తీసిన పదార్థం క్యాన్సర్ కణాలు నాశనం చేస్తుంది. గింజల నుంచి తీసిన తైలం క్రిమి సంహారక మందుల్లో వాడుతారు. పండులో ఉండే మెగ్నిషియం కండరాలు ధృఢంగా ఉంచుతుంది. గర్భిణీలు ఈ పండు తింటే పొట్టలో శిశువు యొక్క మెదడు ,నాడీ వ్యవస్థ వ్యాధి నిరోధకత పెరిగేందుకు సహాయకారిగా ఉంటుంది. ఎవరైనా బరువు పెరగాలంటే సీతాఫలం జ్యూస్ లో తేనె కలిపి తాగితే రిజల్ట్ కనిపిస్తుంది. ఇది ప్రతి రోజు తీసుకొంటే క్యాలరీలు పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ స్థితి స్థాపకతను నిలిపివేసి వృద్దాప్యం దగ్గరకు రానివ్వదు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.