Categories
నిద్రలేమితో ఎన్నో ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయన్నది తెలిసిందే.కానీ సరికొత్త అధ్యయనం అతిగా నిద్ర పోయిన వారిలో గుండె జబ్బులు,డిప్రెషన్ వంటి జబ్బులు త్వరగా వస్తాయి అంటోంది…మనిషికి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర చాలా అవసరం అంతకన్నా తక్కువ నిద్ర పోతే గుండెజబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్లు అధ్యయనకారులు తేల్చారు.అలాగే 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిలో 35 శాతం గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు అతినిద్ర మూలంగా డి ఎన్ ఎ కూడా మారుతున్నట్లు తేలింది.అంచేత సరిగ్గా ఎనిమిది గంటల నిద్రే ఆరోగ్యం అంటున్నారు అధ్యయనకారులు.