Categories
సోలార్ లజ్జా మెషిన్ ను కనిపెట్టిన ముంబై కి చెందిన మధురిత గుప్తా ఆమె తమ్ముడు రూపన్ లకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ సోలార్ లజ్జా మెషిన్ కాల్చి బూడిద చేస్తుంది. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తి తో పనిచేస్తుంది.దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీని ద్వారా వెలువడే బూడిద ను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. 2019లో ప్రారంభించిన ఈ మిషిన్ లను 11 రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో అమర్చారు సోలార్ లజ్జా ద్వారా కొందరికి ఉపాధి కూడా ఉంటుంది భవిష్యత్ లో వీటి ఉత్పత్తిని పెంచు తాము అని చెబుతోంది మధురిత గుప్తా.