మస్కులర్ డిజార్డర్ వల్ల వీల్ చైర్ కు పరిమితమైన స్వర్ణలత గాయనిగా రచయితగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందింది. ఆమె స్థాపించిన స్వర్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తోంది. ఆమె ఫౌండేషన్ తరఫున సారధి పేర తయారు చేసిన ఒక వాహనంలోకి దివ్యాంగులు తమ వీల్ చైర్ తో పాటు ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయచ్చు. సోఫా, బెడ్, వేడి నీళ్లు, టాయిలెట్ సదుపాయాలు ఉన్న ఈ వాహనం లో ఎంతో మంది దివ్యాంగులు ప్రయాణం చేసి అవసరమైన పనులు పూర్తి చేసుకున్నారు. దివ్యాంగుల పట్ల సమాజం ఎంతో మారాలి ప్రభుత్వాలు కూడా వారికి అనుకూలంగా ఉండే అనేక సదుపాయాలు కలుగజేయాలి అంటుంది స్వర్ణలత.

Leave a comment