Categories
మెనోపాజ్ మహిళలందరికీ ఎదురయ్యేదే కానీ ఒకళ్ళకి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల తయారీ తగ్గిపోవటంతో వచ్చే దశ ఇది.కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో ఉపశమనం పొందవచ్చు. ఉదయం తప్పకుండా నడవాలి కండరాల దృఢత్వం కోసం వ్యాయామం చేయాలి వదులుగా ఉండే నూలు దుస్తులు వేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర పోవడానికి అలవాటు పడాలి తరచూ నీళ్లు తాగాలి.వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పోషకాహారం తప్పనిసరి మధుమేహం అదుపులో ఉంచుకోవాలి యోగ ధ్యానం తో ఒత్తిడి తగ్గించుకోవాలి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిల్ని గమనించుకుంటూ అదుపులో ఉంచుకుంటే మెనోపాజ్ సమస్యని కాస్త తేలికగా దాటవేయచ్చు.