ఈనాటి కూతుళ్లు ఎంతోమంది తండ్రి వ్యాపారంలో బాధ్యత తీసుకుంటున్నారు. ముఖేష్ అంబానీ పేరు వినని వాళ్లుండరు. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆయన కూతురు ఇషా అంబానీ చిన్నప్పటినుంచే చదువుల్లో దిట్ట. సైకాలజీ లో డిగ్రీ పూర్తీ చేసింది. అతి చిన్న వయసులో తండ్రి నడిపే సంస్థలకు బోర్డు డైరెక్టర్ గా ఎన్నికైంది. ఫోర్బ్స్ గ్లోబల్ యంగెస్ట్ బిలీనియర్ గా ద్వితీయ స్థానం లో వుంది. పవర్ బిజినెస్ ఉమెన్ గా ఎన్నికైంది. వ్యాపార మెళకువలు కోసం న్యూయార్క్ బిజినెస్ అనాలజిస్ట్ ఎమ్ .సీ కీన్ సేన్ తో కలిపి పనిచేసింది. ప్రత్యేక శిక్షణ తీసుకున్నాకే వ్యాపార బాధ్యతల్లోకి వచ్చింది. చదువు అయ్యి అంతర్జాతీయ వ్యవహారాలపై ఇషా కు అవగాహనా వుంది. తండ్రి పేరు ఉపయోగించకుండా ఇషా సొంత గుర్తింపు తెచ్చుకుందని తల్లి నీతూ అంబానీ ఎంతో సంతోషంతో వుంటుంది. ఎలాంటి సమస్య నైనా వెంటనే పరిష్కరిస్తుందనీ ఏ పనైనా చేసేందుకు ఆమె వెనకాడదని రిలయన్స్ కంపెనీ ఉద్యోగులు చెప్తారు.
Categories