ఇప్పటి యూత్ చాలా మంది ఛాయిస్ బుల్లితెర లేదా సినిమా లేదా సినిమా చుట్టూ వుండే ఉద్యోగావకాశాలు గురించే ఆలోచిస్తూ వుంటారు. మంచి ఫేస్ ఫీచర్స్ వుండే తెర  పైకి ఇతరత్రా క్రియేటివ్ లక్షణాలుంటే తెరవెనక్కీ తేలికగానే అవకాశాలు దొరికే రోజులివి. మంచి వాయిస్ ఉంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ వోవర్స్ కు ట్రై చేయచ్చు. చక్కని గొంతును అథారిటేటివ్ గామార్చాలంటే వాయిస్ డిమాండింగ్ గా వుండాలంటే  పోశ్చర్ నిఠారుగా వుండాలి. మెడ భుజాలు వెన్ను సరైన ఎలైట్ మెంట్ లో వుండే డయాఫ్రాగమ్ డ్రాప్ అయి ఊపిరి తిత్తులను  మరింత గాలి ఇస్తుంది. దృఢమైన స్పష్టమైన టోన్ కోసం ఎల్ల వేళలా హైడ్రేషనూ అవసరం. వోకల్ ఫోల్డ్స్సరైన లూబ్రికేషన్ వున్నప్పుడు ఉత్తమంగా పనిచేస్తాయి కాన్ఫిడెంట్ గా గొంతు పెగలాలంటే శరీరం ముందు అందుకు సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చేవే. నటన తో  సహా ఫలానా వృత్తిలో నిలబడాలి అనుకుంటే అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలి. తీసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి కూడా.

Leave a comment