ఎర్రగా, కట్ చేస్తూ ఉండగానే చేతులంత ఖరాబు చేసే బీట్ రూట్ తరచూ తీసుకోవడం వల్ల అలాగే లాభాలు అన్ని ఇన్నీ కావు. బీట్ రూట్లో కేలరీలు చాలా తక్కువ. కొవ్వు అసలే వుండదు. దీనిని రసం రూపంలో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్యపెరగడమే కాదు రక్తహీనత సమస్య కూడా ఎదురుకాకుండా వుంటుంది. సన్నబడాలనుకునేవాళ్ళు ఈ రసం తరచూ తీసుకోవచ్చు. ఈ దుంపల్లో ఇనుము, పొటాషియం, మాంగనీస్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ పషకాలురోగ నిరోధక శక్తి పెంచేవే ఇందులో వుండే పిచు జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగ్గా సాగేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఫోలేట్ శతం కూడా చాలా ఎక్కువ. గర్భిణులు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే పాపాయిలో నాడీ సంభందమైన సమస్యలు రావు. ఈ దుమ్పకు ఎరుపు రంగుని కలిగించే బీటా సైయానిన్ కు పెద్ద పేగుల్లో కాన్సర్ తో పోరాడే లక్షణం వుంది. సౌందర్యానిచ్చే దుంప కూడా. చర్మం గోళ్ళు వెంట్రుకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది పెదవులు పోదిబరనివ్వదు.
Categories