ట్రాన్స్ న్యూస్ మన దేశంలోనే ట్రాన్స్ జండర్ లు నడుపుతున్న మొదటి ఆన్ లైన్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ లో కనిపించే అందరు మోడళ్ళూ ట్రాన్స్ జండర్ లే ముగ్గురు ట్రాన్స్ జండర్స్ రిపోర్టర్ లుగా పనిచేసే ఈ ఆన్ లైన్ పత్రికలో ఫ్యాషన్ ,బ్యూటీ,వంటలు,ఆర్టికల్స్,కథలు కవితలు ఉన్నాయి. ఈ మ్యాగజైన్ లో వచ్చే ఆర్టికల్స్ లో ట్రాన్స్ జెండర్ లపైనా ఉన్న తప్పుడు అభిప్రాయలు పోతాయి అంటున్నారు మేనేజింగ్ ఎడిటర్ మహాలక్ష్మి రాఘవన్ మా మేగజైన్ ఎంతో ఆసక్తిగా చదువుతున్నారు. ఆన్ లైన్ లో ఉంచిన మూడు సంచికలకు పాఠకుల నుంచి స్పందన వచ్చింది అంటోంది అసోసియేట్ ఎడిటర్ గా ఉన్న షాలిని.

Leave a comment