
కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూంటారు శ్రావణమాసపు వర్షరుతువులో మొలకెత్తిన ఔషధ వృక్షాలు భాద్రపద మాసంలో ఔషధ గుణాలు నింపుకొని ఆశ్వయుజంలో పెరిగి పెద్దవయిన వన సంపద నీడలో నేతి బీర, తియ్య గుమ్మడి, ఉసిరిక మొదలైన ఆరోగ్య కారకమైన పదార్థాలు తినడం వనభోజన లక్ష్యం రమ్యమైన భావనల్లో నివసించేవారు,ఏమీ లేని నిరుపేదలు తారతమ్యాలు మరచి ఏక పంక్తి భోజనం చేయటం ఇంకో లక్ష్యం. బంధు మిత్ర సపరివార సమేతంగా అంటారు కనుక ఒకసారి ఆత్మీయతులందరినీ కలుసుకొని ముచ్చటించుకోవటం మరో లక్ష్యం. వేగవంతమైన జీవితంలో నిమిషం తీరిక లేకుండా గడిపే అందరికీ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లేని ప్రశాంతమైన వన సీమలలో ఓ రోజు గడిపే అవకాశం ఇది అపూర్వం సామూహికంగా భగవంతుడిని అర్చించి ప్రసాదం తీసుకోవటం , ఈ శరదృతువులో నిలువెల్లా పుష్పించే ప్రకృతిని కళ్ళారా చూడటం, ప్రశాంతమైన వాతావరణంలో అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుని ఆనందించడం ఈ వనభోజనాల అంతరార్థం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134