కళ్ళు మాట్లాడతాయి అంటారు. కవులు, కమలాలతోనూ మీనాల తోనూ పోల్చి ఆ కళ్ళు ఎంత ఆకర్షణియంగా వుంటే ముఖం అంతలా వెలిగిపోతుంది. అంట అందమైన కళ్ళు కావాలంటే విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకోమంటారు నిపుణులు. కళ్ళ అడగు చర్మం బిగుతుగా ఆరోగ్యంగా వుండేలా శ్రద్ధ తీసుకోవాలి. కనుబొమ్మలు మంచి ఆకృతి తో వుండాలి. తగినంత విశ్రాంతి ఇవ్వాలి. కంటి చుట్టూ చెర్మానికి తేమ అందేలా ఏదైనా మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కళ్ళకు చల్లదానం ఇచ్చే కిరాదోస, చల్లని గ్రీన్ టీ బాగ్ లు, ఐస్ ముక్కలు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళ అలసట తీర్చాలి. వ్యాయామం కూడా కళ్ళకు మేలు చేస్తుంది. కళ్ళను గుండ్రంగా తిప్పడం కుడి ఎడమలకు, పైకి కిందికి కళ్ళను తిప్పడం, చూపుడు వేలును కళ్ళ ఎదురుగా వుంచి వాటిని సూటిగా చూస్తూ వుంటాం ఇలా చేస్తే అలసిన కళ్ళకు స్వాంతన లభిస్తుంది.

Leave a comment