Categories
ఎండలొస్తున్నాయి అంటే చమటలు పట్టిస్తాయి. కాసేపు బయటి వాతావరణంలో గడిపినా స్వేదం ,చర్మంపై మురికి కలిసి దుర్వాసన వస్తాయి. స్థనాలు, చేతుల కింద, వ్యక్తిగత ప్రదేశాలు ఎక్కువ చమటలు పట్టే ప్రాంతాలు. స్వేద గ్రంథులు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఈ స్వేదంలో బ్యాక్టిరియా కలిసి వాసన వస్తుంది. ప్రతి రోజు రెండు పూటల స్నానం తప్పని సరి . యాంటి బాక్టీరియా సబ్బులు ఉపయోగించి తీరాలి. చేతుల క్రింద డియోడ్రెంట్ లు యాంటి పరిసిస్టెంట్ వాడితే వాసన రాకుండా ఉంటుంది. ఆహారంలో వెల్లుల్లి వినియోగం కూడా దుర్వాసనకు కారణం అవుతుంది. తేలికైనా ఆహారం తీసుకుంటే వేసవికి విరుగుడు ఉంటుంది.