![](https://vanithavani.com/wp-content/uploads/2020/02/maxresdefault-6.jpg)
చిన్ని శిశువూ…చిన్ని శిశువూ
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు!!
కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలోని తిరువరుపులో శ్రీ కృష్ణుని ఆలయం వుంది. ఇక్కడ స్వామి ప్రసాదాన్ని భుజిస్తారు.రోజుకి ఏడు సార్లు నైవేద్యం సమర్పిస్తారు.స్వామి ఆకలికి ఉండలేరు అని తెల్లవారుఝామునే నైవేద్యం పెట్టి సేవలకు అనుమతిస్తారు.
శ్రీ కాళహస్తీశ్వరాలయం సూర్య గ్రహణం నాడు కూడా తెరచియునట్లే ఈ ఆలయం కూడా తెరచే వుంటుంది.సంతానం లేనివారు,వివాహ దోషాలను మొదలగునవి ఈ ఆలయ దర్శనం చేసుకొనిన తప్పకుండా శుభం కలుగుతుంది.ఈ ఆలయం తలుపులు తెరవటానికి ఆలస్యంగానీ లేదా తాళంచెవి కనబడకపోవటం కానీ జరుగునేమో అని ముందు జాగ్రత్త చర్యగా గొడ్డలితో కాపలాగా వుండటం విశేషం.స్వామి వారికి సమర్పించిన నైవేద్యం స్వీకరించినట్టు కొలతలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.కేరళ లోని ఏకైక ఆలయం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,అటుకులు
-తోలేటి వెంకట శిరీష