శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం…..
మహా దివ్య కాయం భజేహం భజేహం!!

మహబూబ్ నగర్లోని శ్రీ నగర్ కాలనీ లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించి వీరులవుదాము రండి.పచ్చని చెట్ల మధ్య ఈ స్వామి ఆలయం నిర్మించారు.మహిమలు గల హనుమంతుడు.
వానర,నారసింహ,వరాహ,హయగ్రీవ ముఖాలను ధరించి ఈ పంచముఖ ఆంజనేయ స్వామి మనలను కటాక్షిస్తారు.అభిషేకాలు,తమలపాకుల పూజతో నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు.భక్తులకు నమ్మకమైన దేవుడు.పిల్లలకు ఇష్టమైన దైవం కూడా ఆంజనేయడే.

ఇష్టమైన రంగుల :కేసరీ
ఇష్టమైన పూలు: నిత్య మల్లె
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు, కేసరి
కేసరి తయారీ: ఒక కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు తీసుకొని ముందుగా రవ్వ దోరగా వేయించాలి తరువాత నీళ్ళు మరిగిన తరువాత రవ్వని అందులో వేసి బాగా ఉడికించి తగినంత పంచదార వేసి ఉడికించాలి.చివరికి జీడి పప్పు, కిస్మిస్తో నైవేద్యం పెట్టాలి.

     “శ్రీ  రామ  దూతం….శిరసా నమామి”

 

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment