Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2019/05/saraswathi-devi.jpg)
“వరవీణా మృదుపాణి వనరుహలోచను
రాణి..సురుచిర బంబర వేసి….
సురనుత కల్యాణి”
ఈ రోజు అమ్మవారు మనకు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనం ఇస్తారు.కళాకారులకు శుభదినం.ఈ రోజు ఏ కళను అంటే సంగీతం, నృత్యం మొదలగునవి
ప్రారంభిస్తే చాలా మంచిది.అమ్మవారికి తేట తెలుపు వస్త్రధారణలో పూజలు చేసిన సరస్వతీ దేవి మన యందు ఎల్లప్పుడూ ఆశీస్సులు అందిస్తుంది.
బాసరలోని సరస్వతీ దేవిని కనులారా వీక్షించటం అదృష్టం.సర్వాంగ సుందరంగా అలంకరించుకుని భక్తులకు దర్శనం ఇస్తుంది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,దద్ధోజనం,చక్ర పొంగలి.
మామవతు శ్రీ సరస్వతీ!!
-తోలేటి వెంకట శిరీష .