Categories
శ్రీ విల్లిపుత్తూరు అంటే గుర్తు వచ్చేది ఆండాళ్ అమ్మవారి రూపం.గోదాదేవి అని కూడా వర్ణిస్తూ వుంటాము.
శ్రీ కృష్ణ దేవరాయలు వారు “ఆముక్తమాల్యద” అని సంబోధిస్తారు.కృష్ణ పరమాత్మను ఆండాళ్ అమ్మవారు 30 పాశురాలతో వర్ణిస్తూ ఈ మాసం అంతా ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం అని పురాణ గాథలు చెబుతున్నాయి.
శ్రీ విల్లిపుత్తూరులో ఈ మాసంలో “తిరుప్పావై” పఠనం చేసి ముక్తి పొందుతారు భక్తులు.నగర సంకీర్తనలతో ఊరు- వాడా సందడిగా సంబరాలతో నిండి వుంటుంది.
నిత్య ప్రసాదం: కొబ్బరి,తులసి మాలలు.
-తోలేటి వెంకట శిరీష