“ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహీమల దేవకీ సుతుడూ…”
చెన్నై లో ఉన్న శ్రీమంతలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి.కొత్తగా వివాహం చేసుకున్న వారు,సంతానం లేని వారు ఈ తల్లి దగ్గర ముడుపులు కడితే కొంగు బంగారమే సుమండీ!!
ఈ క్షేత్రంలో లక్ష్మి దేవికి రోజు శ్రీమంత వేడుకే.ముతైదువులు చక్కగా అలంకరించుకుని,ఎంతో భక్తితో అమ్మవారి కటాక్షం కొరకు పూజించి తరిస్తారు.శుక్రవారం ఉదయం,సాయంత్రం ఆలయం ఎంతో కళ కళ లాడుతూ ఉంటుంది.ముడుపులు చెల్లించే వారు అమ్మవారి సన్నిధిలోనే శ్రీమంత వేడుక జరుపుకుంటారు.అందుకే ఇక్కడ అమ్మ వారికి శ్రీమంతలక్ష్మి దేవి గా ప్రసిద్ధి.
లక్ష్మి దేవి ఆశీస్సులు అందుకోవడం కోసం భక్తులు దూర ప్రదేశాల నుండి వస్తారు.
అమ్మ వారు నిత్య శ్రీమంత మహాలక్ష్మి.
ఇష్టమైన రంగులు:ఎరుపు, ఆకుపచ్చ,పసుపు.
ఇష్టమైన పూలు: మల్లె పూల దండలు,కనకాంబరాలు,చేమంతి.
ఇష్టమైన పూజలు: కుంకుమార్చన.
నిత్య ప్రసాదం: గర్భవతులు కొబ్బరికాయ కొట్టడం అనివార్యం.
పండ్లు,చలిమిడి అమ్మవారికి నైవేద్యం.
చలిమిడి తయారీ:ముందుగా బెల్లం నీళ్ళలో నానబెట్టి తయారు చేసి దానిలో తడి బియ్యం పిండి వేసి కలిపి, చిన్నగా తిరిగిన కొబ్బరి ముక్కలు వేసి, బాదం,జీడి పప్పు తో అలంకరించి ముందుగా అమ్మవారికి సమర్పించుకుని తరువాత శ్రీమంత పెళ్లికూతురుకి ఒడిలో పెట్టాలి.
-తోలేటి వెంకట శిరీష