Categories
ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ప్రసిద్దా శివక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా పార్వతీ దేవి భ్రమరాంబిక గా వెలిశారు. దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన ఈ శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలాన్ని శ్రీగిరి ,శ్రీ పర్వతం మొదలైన పేర్లతో పిలుస్తారు. శ్రీ అంటే సంపద,శైలమంటే పర్వతం. ఒక శాసన ప్రకారం దీన్ని శ్రీ కైలాసం అంటారు. మల్లికార్జుని గుడి నాలుగు మండపాలతో అపూర్వ శిల్ప సంపదతో ఉంటుంది. ఇక భ్రమరాంబిక ఆలయపు గోడలకు చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుంది.