బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ పింకీ ప్రమాణిక్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు వివాదాలతో ఆటకు దూరమైన ఓ అమ్మాయి జీవితం ఓ పెద్ద తెర పైన కనిపించబోతుంది. పింకీ ప్రామాణిక్ పశ్చిమ బంగా  లోని చిన్న పల్లెటూరు నుంచి వచ్చింది  స్ప్రింటర్ గా అంతర్జాతీయ పోటీను  ఎన్నో బంగారు వెండి పతకాలు గెల్చుకొంది. ఆమెతో నివశించే ఒకమ్మాయి పింకీ అసలు అమ్మాయే కాదని తనపై అత్యాచారం చేసిందని కేస్ పెట్టటంతో పింకీ ఆటలకు,తన రైల్వే ఉద్యోగానికి దూరమైన రెండేళ్లపాటు మగవాళ్ల సెల్ లో గడిపింది . 2014 లో ఆమె పై ఆరోపణలు అసత్యాలని కోర్ట్ కేస్ కొట్టేసింది. మళ్ళీ ఉద్యోగం లభించినా ఆటలకు మాత్రం దూరం అయింది పింకీ. ఇప్పుడామె జీవిత కథ సినిమాగా వస్తోంది.

Leave a comment