ఫేషియల్ కోసం కొన్ని రకాల పండ్లు,కొన్ని దినుసులుంటే చాలు. ఫేషియల్ చేసుకొనేందుకు ముందుగా క్లెన్సింగ్ చేయాలి. పాలలో ముంచిన దూది ఉండల తో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఆపై నీళ్లతో కడగాలి. అలాగే మృతకణాలు పోగొట్టుకొనేందుకు ఓట్స్ పొడి పాలను కలిపి ముఖానికి పట్టించాలి. మునివేళ్లతో మర్దన చేసి తరువాత ఆవిరి పడితే మృతకణాలు పోతాయి అప్పుడు తేనె అరటి పండు,బొప్పాయి వంటి రకరకాల పండ్లతో ముఖానికి మసాజ్ చేయచ్చు. చివరిగా కీర దోస తో ఫేస్ ప్యాక్ వేసుకొంటే ముఖానికి మెరుపు వస్తుంది. చివరిగా ముఖం శుభ్రంగా చల్లని నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి .

Leave a comment