తెలుగు లో తొలి మహిళా స్ట్రీట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొన్నది స్వాతి.ఖమ్మం లో పుట్టిపెరిగిన స్వాతి జేఎన్టీయూలో ఫైన్ఆర్ట్స్ చదివింది.తనతో పాటు చదివే విజయ్ ను పెళ్లి చేసుకోన్నాక ఇద్దరు కలిసి వేసే బొమ్మలతో స్వాతి విజయ్ ఒక బ్రాండ్ అయ్యారు రాష్ట్రంలో తోలి స్ట్రీట్ ఆర్ట్స్ గీశాము. స్ట్రీట్ ఆర్టిస్ట్ ల ఇన్నోవేటివ్ టాలెంట్ వుండి నిజాయితీగా పని చేస్తే చాలు విజయం దక్కుతుంది అంటోంది స్వాతి. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాల గోడలపై మంచి బొమ్మలు గీసే ప్రాజెక్ట్ మాకే వచ్చింది. మారేడుమిల్లి చింతూరు గిరిజన ప్రాంతాల్లో,పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, బస్టాండ్స్ గోడలపై గిస్తున్నాం అంటోంది స్వాతి.