సమంత నిస్సందేహంగా సక్సెస్ ఫుల్ కధానాయిక. అందం అభినయం తో ఏ పాత్రలో నైనా ఒదిగిపోతుంది . ఇదే ఆమె సక్సెస్ సూత్రం కష్టపడి పనిచేయటం ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి ఒక చిత్రం నటిస్తోంది. స్టార్ హీరోయిన్ అయ్యాక జయాపజయాలు విషయంలో మీ వైఖరి ఏదైనా మార్పులొచ్చాయా అని అడిగితే అప్పుడు ఇప్పుడు ఒకేలాగా వున్నానంది  సమంత. విజయం పరాజయం రెండు పోరాటమే నేర్పాయి ఈ రెండు నాకు ఒక్క విషయాన్నీ తెలియజెప్పటం వల్ల నెమో ఒక సక్సెస్ వస్తే ఇంకా  కష్టపడాలి అనుకుంటాను. ఇక పరాజయం ఎదురైతే నా దృష్టిలో అదో ముచ్చట. నా వంతు కృషి చేసిన తృప్తి మాత్రం నాకుంటుంది . ఆ మచ్చ వీలైనంత త్వరగా మానిపోయేందుకు కొత్త సినిమాలు ఇంకా ఎక్కువ కష్టపడతా. నేనేత చేయాలో అంతా చేస్తాను. అంటూ చెప్పింది సమంత . ఈ లక్షణమే ఆమెని అగ్రస్థానంలో కూర్చోబెట్టింది. తోటి కథానాయికలకు స్ఫూర్తిగా నిలబెట్టింది.

 

Leave a comment