ఎప్పుడు స్ప్రేలు, బాడీ లోషన్ లేనా అని కాస్తా వెరైటీ కోసం చూస్తే పరిమళ ద్రవ్యాలు వైపు చూడోచ్చు. ఈ కాలంలో మల్లెలు ఎలాగు వస్తాయి. అలాగే పువ్వులు,పండ్లు సిట్రస్ ఆధారితంగా చేసినవి ఎన్నో సువాసనాలు ఉన్నాయి. ఎండల్లో చెమటలు ఎక్కువగా పోస్తాయి. బాడీ లోషన్ లు ఇవ్వలేని తాజా సువాసనని ఈ పరిమళాలు ఇస్తాయి. మెడ, మోచేతులు,మణికట్టు,భుజాల వద్ద కొద్దిగా అద్దిన సరే మల్లె, సన్నజాజులు పరిమళం రోజంతా మనలో వస్తూనే ఉంటుంది. ఇవి ఒకే వెరైటీ బాగా అనిపించకపోతే రెండు మూడు పరిమళాలు కలిపి వాడోచ్చు. అన్ని సహజమైన వెలికితీతలే అవ్వటం వల్ల అలా కలగలిసిన నష్టం లేదు. ఈ వాసన ఎక్కువసేపు ఆగాలంటే దుస్తుల పైన చల్లుకోవాలి.

Leave a comment