Categories
ఘాటైన వాసన కమ్మని రుచి గల పూదినలో ఔషధగుణాలు అన్నీఇన్నికావు. టూత్ఛ పేస్ట్ ,చూయింగ గమ్ ,పిప్పర్ మెంట్స్ లో పూదినా వాడటం ఈ కారణం వల్లనే, జ్ణాపకశక్తికి సంబంధించిన సమస్య ఉంటే పూదిన మంచి ఔషధమే. పూదిన రసాన్ని నీటిలో కలిపి పుక్కిటపడితే నోటి దుర్వాస దంత సమస్యలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో పసుపు, పూదిన ఆకులు వేసి మంరిగించిన టీ తాగితే మంచిది. పూదిన నుంచి తయారు చేసిన మెంథాల్ ,కర్పూరం, కొబ్బరి నూనె కలిపి పిల్లల వీపు పైన రాస్తే జలుబు తగ్గుతుంది. పూదిన రసంతో ముఖం పై మచ్చలు పోతాయి.