ఈ సీజన్లో ద్రాక్ష పండ్లు బాగా వస్తాయి. ఇవి సౌందర్య సాధనాలు కూడా. ద్రాక్ష రసంలో రెండు చుక్కల బాదాం నూనె కలిపి చేతులు కళ్ళకు మసాజ్ చేసుకుంటే రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం నున్నగా మెరిసిపోతుంది. పెదవులకు ప్రతి రోజు రాస్తూ ఉంటే నలుపు పోయి ఎర్రగా మెరుస్తాయి. నల్ల ద్రాక్ష పండు మెత్తగా చిదిమి ఒక్క స్పూన్ చక్కర , చిటికెడు పసుపు కలిపి మొహం మెడకు పట్టించి మసాజ్ చేస్తే మృతకణాలు ఇట్టే పోతాయి. నల్ల ద్రాక్ష గుజ్జు , రెండు టేబుల్ స్పూన్ పాలు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖం మెడకు పట్టిస్తే ఖరీదైన పేస్ ప్యాక్ కంటే చక్కగా పని చేస్తుంది. వీరిలో ప్రయోజనాలు వున్నాయి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ.

Leave a comment