వేసవిలో ప్రసవిస్తే వాళ్ళని ఎంతో జాగ్రత్తగా సాకాలని చాలా భయపడతాం . కానీ కొత్త అధ్యయనం వేసవిలో జన్మించిన పిల్లలు దృడంగా ఆరోగ్యంగా వుంటారని చెపుతోంది సూర్యకాంతికి బాగా ఎక్స్ పోజ్ అవటం తో ముందు తల్లి గర్భంలో ఉండగాను,జన్మించాక తోలి నెలల్లోను ఎముక అభివృధి బాగా జరుగుతుంది. ఇది వేసవిలో తల్లులైన వారికీ ఉపయోగ పడే అంశమే. గర్భవతులు ఉదయం సమయంలో లేలేత సూర్య కిరణాలు తగిలే విదంగా నడిస్తే శిశువుకు చాలా మంచిది. అలాగే పుట్టిన శిశువుకు ఉదయం ఎండ సోకేలా కొద్దిసేపు ఉంచాలి. ఎలాంటి ఉష్ణోగ్రత ఉన్నా వాతారణంలో నివసించే వారైనా ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాపాయి ఎముకలు బలంగా దృడంగా ఆరోగ్యంగా ఉంటాయని అధ్యయనకారులు సూచిస్తున్నారు.

Leave a comment