ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి దిశా నిర్దేశం చేసిన కొద్ది మంది కీలక శాస్త్రవేత్తల్లో ఒకరుగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు సునీత సరావాగి ఆమె డేటా మైనింగ్ మెషిన్ లెర్నింగ్ వంటి అంశాల్లో కీలక పరిశోధనలు చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్సట్రాక్షన్ టెక్నిక్స్ కు రూపకల్పన చేసిన తొలి తరం శాస్త్రవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు కంప్యూటర్ డేటా లోకి చేరిన పేర్లు అడ్రస్ ల డూప్లికేషన్ తొలగించేందుకు అవసరమైన సాఫ్ట్ వేర్ రూపొందించారు.డేటాబేస్ మైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో కీలక మైన మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన అంశాలపై సునీత సాగిస్తున్న పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ప్రస్తుతం ఆమె బాంబే లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని సెంటర్ ఫర్ మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా లర్నింగ్ విభాగంలో ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు.