Categories
చిత్తూరు జిల్లాలోని నాగలాపురం లో మనకు శయనిస్తున్న శివుని దర్శన భాగ్యం కలుగుతుంది.మన దేశంలో ఉన్న ఏకైక శివాలయం.
కథనం ప్రకారం దేవదానవులు క్షీరసాగరం లో ఉద్భవించిన విషం తాగిన శివుడు పార్వతీదేవి ఒడిలో సేద తీరాడని అందుకే శయనమూర్తిగా కనిపిస్తాడు.మనము శ్రీ మహావిష్ణువుని ఆ భంగిమలో చూస్తాం కానీ ఇక్కడ అలాంటి భంగిమలో శివుడు కనిపిస్తాడు.ఈ ఆలయ ప్రదేశంను సురుటపల్లి అని పిలిచేవారు రాను రాను సురులపల్లిగా వాడుకలో ఉంది.స్వామివారి ఆలయంలో నిత్యనూతనంగా అన్ని పర్వదినాలు శోభాయమానంగా జరుగుతాయి.
నిత్య ప్రసాదం:కొబ్బరి, పంచామృతాలు
-తోలేటి వెంకట శిరీష