పోషకాహార లోపం గురించి శరీరం తప్పకుండా కొన్ని సంకేతాలస్తూ ఉంటుంది.కాలిన గాయాలు తగ్గకపోవడం జలుబు దగ్గు ఫ్లూ వంటివి తరచు రావటం శరీరంలో విటమిన్ సి లోపం కావచ్చు.ఆకుకూరలు సిట్రస్ పండ్లు క్యాప్సికం వంటివి రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.జుట్టు రాలి పోతున్న, నీరసం ఆయాసం వంటివి ఉన్నా ఇనుము తగ్గినట్లు అనుకోవచ్చు.కాళ్లు చేతుల నొప్పి ఉన్న కీళ్ల దగ్గర భరించలేనంత బాధ ఉంటే విటమిన్ డి క్యాల్షియం తగ్గినట్లు గుర్తించవచ్చు.ఈ రెండు పోషకాలు శరీరంలోని ఎముకలకు బలోపేతం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

Leave a comment