Categories

జడలో పూలు పెట్టుకోవటం భారతీయ మహిళలకు సంప్రదాయ సిద్ధమైన అలవాటు. ఏ రుతువులో పూసే పూలు ఆ రుతువులో పెట్టుకొంటూ ఉంటావు . ఆ పూవులు ,. ఆ పూవులలో కలసి అట్లే మరువం,దవనం సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తూ మనసులకు ప్రశాంతత ఇస్తాయి కూడా . ఈ చక్కని పూల సువాసనలు మెదడు లోని భావోద్వేగాలను అదుపు చేసే కేంద్రం పైన ప్రభావం చుపిస్తాయని అధ్యయనాలు చెపుతాయి . మానసిక ఆందోళనకు గురవుతున్న వారికీ కేలియం అనే మందు ఇస్తారు . ఈ మందు మెదడు పైన ఎలాంటి ప్రభావం చూపెడుతుందో ,మల్లెపూల వాసనలు అంతే ప్రభావం చూపిస్తాయి . చక్కని సువాసనలు వెదజల్లే పూవులను మట్టిపాత్రలో పోసిన నీళ్లలో వేసి గదిమూలల్లో పెడితే ఇల్లంతా సుగంధమయం .