పిల్లలెప్పుడు ఎదో ఒక కంప్లైంట్ చెపుతూనే ఉంటారు. కడుపు నొప్పినో ఇంకేదో ఇందుకు ఫలానా కారణం అంటూ ఉండదు. డాక్టర్లు కూడా ఒక్కసారి ఏవీ లేదనే అంటారు. కానీ ఇలాంటి సమస్యలన్నీ స్పీచ్ థెరపీ తో పోతాయంటున్నారు అధ్యయనాలు. ఈ పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే కాగ్నిటివ్ బిహేవియర్ ధెరపీ ప్రతిభావంతంగా పనిచేస్తుందని ఈ థెరపీ లో పిల్లల ఒత్తిడి ప్రతి స్పందనలకు క్రమ బద్దీకరించగలిగే టెక్నీక్స్ బోధిస్తారని ఇవి పిలల్ల సమస్యలను ఒక దారికి తెస్తాయంటున్నారు. ధెరపిస్ట్ టోనీ పీడియాట్రీషియన్ ల తోనో మాట్లాడించినప్పుడు ఈ థెరపీ లో పిల్లల ఒత్తిడి క్రమబద్దీకరించగలిగే టెక్నీక్స్ బోధిస్తారు నొప్పిని ఎదుర్కోగల అంశాలకు సంబంధించి సాయపడతారు. అలాగే తను సాధారణ కార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరిస్తారు. పిల్లల్లో కూడా తెలియని ఒత్తిడి వారిలో అనేకానేక ఇబ్బందులు కలిగిస్తాయి. లోపల కలిగే చిరాకులని వాళ్ళు అర్ధం చేసుకోలేక నొప్పులంటారు. దీన్ని ఎదిగే క్రమంలో తెలుసుకోగలుగుతారు.
Categories