ఆరవ దలైలామా పుట్టిన ప్రదేశంలో తవాంగ్ వ్యాలీ . అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ములలో ఉండే ఈ తవాంగ్ వ్యాలీ ఎంతో అందమైన ప్రదేశం . మర్చి నుంచి అక్టోబర్ వరకు తవాంగ్ వాతావరణం చాలా భావుంటుంది. సైట్ సీయింగ్ కు అద్భుతమైన ప్రదేశం . బౌద్ధ భిక్షువుల ఆరామాలు ఉంటాయి . బౌద్ధుల యాత్ర స్థలం కూడా బౌద్ గొంపాలు,చెట్లు,ఎటు చూసినా పచ్చదనం ఎతైన జలపాతాలతో తవాంగ్ వ్యాలీ చేయి తిరిగిన చిత్ర కారుడు గీసిన అందమైన పెయింటింగ్ లా ఉంటుంది బ్రహ్మపుత్ర మైదానాల వైపు వెళ్ళటం ఒక ప్రత్యేక అనుభూతి బాధ్నెలా పాస్ కు వెళ్ళే మార్గం అంతా గులాబీ,ఎర్రని వర్ణాల పూవులతో తివాచీ పరిచినట్లే ఉంటాయి . మనిషికి ప్రకృతి ఇచ్చిన బహుమానం ఈ వ్యాలీ .

Leave a comment