ప్రకృతిలో ఉండే ప్రతి పువ్వు ఆకు పండు తమదైన ఒక రంగులో ఉంటాయి. అన్ని రగుల పండ్లు తినడం ఆరోగ్యమే కానీ ఇప్పుడు కొత్త పరిశోధన తెల్లని పండ్లు ,కూరగాయలు ,పోషక భరితం అంటుంది. ఇప్పుడు సహజంగా ఎన్నో రంగుల్లో పండే కూరలు,పండ్లను తెళుపుతోనే పండిస్తున్నారు. ఆగ్నేయాసియాలో తెల్లని కాకార కాయలు,తెల్లని వంకాయలు,క్యారెట్లు,క్యాప్సికం,బీట్ రూట్ ఇవన్ని కొత్త రుచిలో ఎన్నో వ్యాధులకు మందులు కూడా ఉన్నాయి.తెల్ల వంకాయాల్లో మెగ్నిషియం,పొటాషియం,కాఫర్ మూలకాలు ఎక్కువగా ఉన్నాయి. ఓక తెల్లని యాపిల్ రష్యాలో పండే అరుదైన రకం. బాలీలో ఉండే తెల్లని మామిడీ పండు యాంటీ ఆక్సిడెంట్లతో క్యాన్సర్ నిరోధకంగా ఉంటుంది.వీటిలో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుందట. తెలుపులో ఉండే పోషకాలని అర్ధం చేసుకుని ప్రతి పండును తెలుపులో సృష్టిస్తున్నారు హార్టీకల్చరిస్టులు.
Categories