బరువు తగ్గించడం, ఒత్తిడి మాయం చేయటం మొదలు సబ్జా గింజలు ఇంకా ఎన్నో లాభాలున్నాయి వీటిలో విటమిన్ ఎ,ఇ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ఈ సబ్జా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బరువు నే కాదు రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ విత్తనాలను నిమ్మ, ఇతర పండ్ల రసాలు ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ షేక్స్ లో కలిపి తీసుకుంటారు. రాత్రి నానబెట్టిన సబ్జా గింజలను ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. శారీరక శ్రమ చేసేవారు క్రీడాకారులు వీటిని తమ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. వీటిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

Leave a comment