Categories
ఆయుర్వేదం ఒక చికిత్స పద్ధతి కాదు. ఒక జీవన విధానం దాని ద్వారా మన పూర్వికులు ఆరోగ్యంగా జీవించారు ఆయుర్వేద మూలికలు ఆహారం వండుకునే పద్ధతిలోనే ఆరోగ్యం ఉంది అంటున్నారు గీత రమేష్. కేరళలోని పాలక్కాడ్ లో స్థాపించిన కై రాలీ సెంటర్ ఉద్దేశం ఆయుర్వేద ఉత్పత్తుల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావటం అంటారు గీత. ఆయుర్వేద సూత్రాల ప్రకారం తయారు చేసిన వంటకాలు, మసాజ్ లు ఇక్కడ ప్రధాన వైద్య విధానం. అన్ని ఆరోగ్య సమస్యలకు పూర్వీకులు ఆయుర్వేద వైద్య విధానాలతోనే పరిష్కారం చూపించారు. కొన్ని వేల రకాల వంటకాలను రూపొందించారు. కైరాలీ వైద్యవిధానంలో ఇవే ముఖ్యం అంటారు గీతా రమేష్.