ఈ సినిమా కుటుంబ సంక్షేమం పై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకొంది. ఇది ఒక తండ్రి కథ. ముత్తయ్య ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. తన ఇద్దరు పిల్లలకు మంచి చదువు చెప్పించి మంచి  జీవితం ఇవ్వాలని అప్పులు చేసి రాత్రి పగలు కష్టపడిన ఇద్దర్ని చదివిస్తాడు. పెద్ద కొడుకు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుని భార్యతో వేరే కాపురం పెడతాడు. రెండవ కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు దూరంగా ఉండి తర్వాత తల్లి తండ్రి తో కలిసి జీవించేందుకు నిశ్చయించుకుంటాడు. అతని శ్రద్ధతో తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా జీవించటం ఈ సినిమా కథ. కన్న బిడ్డలు తల్లిదండ్రుల పైన ఎందుకు శ్రద్ధతో కృతజ్ఞతలు ఉండాలో చెబుతోందీ  సినిమా, ప్రైమ్ లో ఉంది. ఈ తరం మరచి పోతున్న విలువల్ని గుర్తుచేస్తుందీ సినిమా .

రవిచంద్ర. సి 
7093440630

 
 
 

 
 

Leave a comment