Categories
ఒక తీరు తెన్ను లేని ముళ్ళదారిన మొదటి తరానికి చెందిన మహిళలు ఎన్నో కష్టాలుపడి మరీ ఒక మార్గం ఏర్పరిచారు. రెండో తరం ఆ దారిన తేలిగ్గా నడిచేందుకు వీలైంది. సర్లా థాక్రిర్ తొలి మహిళ పైలట్ . 1914లో జన్మించారు సర్లా. 1936లో ఏవియేషన్ లైసెన్స్ తీసుకోన్నారు. లాహోర్ ప్లెయింగ్ క్లబ్ లో వెయ్యి గంటలు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఘనత సాధించారు. ఆమె భర్త పిడి శర్మ .ఆయన కుటుంబంలో అందరూ పైలెట్లే. వారిని చూసి స్పూర్తితో షర్లా గగనతలంలో విహరించాలని కలలు కన్నారు. పైలెట్ శిక్షణ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమెకు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ లభించలేదు. తర్వాత టెక్స్ లైట్ వ్యాపారంలో స్థిరపడ్డారు.