హెరిటేజ్ ఆర్కిటెక్చర్ సలహాదారు నరపరాజు శ్రావణి. చరిత్రను చెరగనివ్వకుండా విలువైన వారసత్వ కట్టడాలను నిలబెట్టే పనిలో పడిందామె. ఇప్పటికే అండమాన్ జైలు జునాగఢ్ లోని మాక్ బార్ రాణి కోట, వైజాగ్ లోని టౌన్ హాల్ తో సహా ఎన్నో విలువైన ప్రాచీన కట్టడాల కు ప్రాణం పోశారు శ్రావణి. హెరిటేజ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్స్ చేసిన శ్రావణి ప్రస్తుతం గుజరాత్ లోని మాక్ బరా రాణి ప్యాలెస్ కోసం పని చేస్తోంది. ఈ కోటా చాలా భాగం శిధిలావస్థలో ఉంది. పూర్వంలో భవన నిర్మాణాలకు ఏ మిశ్రమాలు వినియోగించారు తెలుసుకుని ఆధునిక పద్ధతిలో పునర్ నిర్మిస్తున్నాం అంటుంది శ్రావణి.