మహారాష్ట్ర లోని పశ్చిమ తీరంలో ఉండే సింధు దుర్గ్ లో ఉంటుంది శ్వేతా హుల్ అక్కడికి దగ్గరలోనే వెంగుర్లి గ్రామంలో దాదాపు 12 చదరపు కిలోమీటర్ల మేరకు మాడ అడవులు ఉంటాయి అక్కడికి ఏడాది పొడవునా దేశవిదేశాలకు చెందిన పక్షులు వస్తాయి గోవా నుంచి రెండు గంటల దూరం. శ్వేత గ్రామంలోని స్వామిని స్వయం సహాయక బృందం అధ్యక్షురాలు.ఆ బృందంతో కలిసి పర్యాటకులను ఈ మడ అడవుల్లో బోట్లలో తిప్పాలని చర్చించింది.ఆలోచన అందరికీ నచ్చక ప్రభుత్వ అనుమతి తీసుకొని ఈ స్త్రీలు సఫారీ నిర్వహిస్తున్నారు తేడ్డు వేస్తూ నడిపే బోట్లలో పర్యాటకులను మడ అడవుల్లో తిప్పి ఆదాయం సంపాదిస్తున్నారు.ఈ బృందానికి శ్వేతా హుల్ నాయకురాలు.