డార్నెల్లా ఫ్రాజియర్ అమెరికా ప్రతిష్ఠాత్మక ‘బెనెసన్‌ కరేజ్‌ అవార్డ్ అందుకొన్నది. 18 ఏళ్ల డార్నెల్లా జర్నలిస్టు కాదు.అమెరికాలోని మినియా పొలిస్‌కి చెందిన ఆమె గత ఏడాది తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లింది. అక్కడ పోలీస్‌ ఆఫీసర్‌ నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను కిందపడేసి మోకాలితో గొంతును పట్టి ఉంచాడు. అతను ‘ఊపిరాడటంలేదు, వదిలే’ యమంటూ పోలీస్‌ను బతిమాలుతున్నాడు. చుట్టు ఉన్నవారెవరూ వారి దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొద్దిసేపటికే ఫ్లాయిడ్‌ ఊపిరాడక చనిపోయాడు. డార్నెల్లా ఈ దారుణాన్నంతా వీడియో తీసింది. ఆ తొమ్మిది నిమిషాల వీడియో ప్రపంచాన్ని కుదిపేసింది. నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం రేకెత్తేలానూ చేసింది.  ఈ వీడియోని ఆధారంగా తీసుకుని ఆ పోలీస్‌ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా హత్యానేరం కింద జైలు శిక్షనూ విధించారు. ధైర్యంగా వీడియోను తీయడమే కాకుండా వ్యవస్థ పేరిట జరుగుతున్న క్రూర చర్యలను బయట పెట్టడానికి డార్నెల్లా కారణమైంది.ఈమెను స్ఫూర్తి గా తీసుకొని సామాన్యులు కూడా అన్యాయాల పట్ల స్పందించాలనే ఉద్దేశంతోనే ఈ అవార్డ్ కు డార్నెల్లా ని ఎంపిక చేశాం అంటున్నారు పులిట్జర్‌ కమిటీ సభ్యులు. ఫ్రాయిడ్ హత్యను నేను కళ్లారా చూశాను. కనీసం దగ్గరకైనా వెళ్లనందుకు సాయం చేయలేకపోయినందుకు ఎన్నోసార్లు కన్నీళ్లతో అతనికి క్షమాపణ చెప్పుకొన్నాను అంటుంది డార్నెల్లా. ఆమె ధైర్యానికి గుర్తింపుగా పలు పురస్కారాలు అవార్డ్ లు అందుకొంది డార్నెల్లా !

Leave a comment