ఫోర్బ్స్ లో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 55 వ స్థానంలో ఉంది 39 ఏళ్ల రోషిణి నాడార్ మల్హోత్రా. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు 37 వేల కోట్ల రూపాయలు ప్రముఖ పారిశ్రామికవేత్త HCL అధినేత శివ నాడార్ వారసురాలు అంచెలంచెలుగా తన ఐటీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ నేడు అత్యంత ధనవంతుల లిస్ట్ లో ఉన్నారు. గత సంవత్సరం HCL చైర్ పర్సన్ బాధ్యతలు తీసుకున్న రోషిణి. ఆమె రేడియో, టీవీ,ఫిల్మ్స్ లో డిగ్రీ చేసింది. లండన్ లోని స్కై న్యూస్ లో ఉద్యోగం చేసింది. 27 ఏళ్ళ వయసులో సాధారణ ఉద్యోగినిగా HCL లో చేరిన రోషిణి ఈరోజు అత్యంత ధనవంతురాలు గా ఫోర్బ్స్ లిస్ట్ లో ఉంది.